తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mukesh Gowda: సినిమాలోకి గుప్పెడంత మనసు రిషిబాబు.. మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

గుప్పెడంత మనసు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ నచ్చని ప్రేక్షకులు లేరంటే అది అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ స్టోరీ, నటీనటుల యాక్షన్ అలా ఉంటుంది. ముఖ్యంగా హీరో రిషి పాత్ర.. ఈ తరం యువత ఎలా ఉండాలో చెప్తుంది. హీరోగా కన్నడ నటుడు ముఖేష్ గౌడ చేస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్ గౌడకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఎస్‌ఎస్‌ఎంజి ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రుద్ర మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయని, అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కుతోందన్నారు.

హీరో ముఖేష్‌గౌడ మాట్లాడుతూ ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌తో కూడుకున్న సినిమా అని అన్నారు. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉందని, యూత్‌కు మా ‘గీతా శంకరం’ బాగా నచ్చుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button