తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Naa Saami Ranga: అంజి గాడు వస్తున్నాడు.. ‘నా సామి రంగ’ బిగ్ అప్‌డేట్

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మన్మధుడిగా పేరున్న సీనియర్ హీరో, కింగ్ నాగార్జున చాలా కాలం గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి విజయ్ బన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ మూవీతో విజయ్‌ బన్నీ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. తాజాగా, ఈ మూవీ నుంచి మ‌రో స్టార్ కాస్ట్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు.

ALSO READ: విజయ్ దేవరకొండపై అసభ్య వీడియో.. యూట్యూబర్ అరెస్ట్

స్పెష‌ల్ ఇంట్రో ప్రోమో..

‘నా సామిరంగ’ మూవీలో అల్ల‌రి న‌రేష్ ‘అంజి’ అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ట్విట్టర్ వేదికగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్ట్‌లో ‘మా అంజి గాడ్ని ప‌రిచ‌యం చేస్తున్నాం.. లేదంటే మాటోచ్చేత్త‌ది’ అంటూ రాసుకొచ్చారు. అదే విధంగా అంజి గాడికి సంబంధించిన స్పెష‌ల్ ఇంట్రో ప్రోమో సైతం రేపు ఉదయం 10.18 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button