తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Netflix: మహేశ్ బాబును కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ.. ఎందుకో తెలుసా?

అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) సీఈఓ టెడ్ సరండోస్ తెలుగు సినీ ప్రముఖులతో వరుసగా సమావేశమవుతున్నారు. మొన్న చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్, నిన్న జూనియర్ ఎన్టీఆర్ (NTR)తో సమావేశమైన ఆయన తాజాగా నేడు ప్రిన్స్ మహేశ్ బాబును (Mahesh Babu) కలిశారు. మహేశ్ తో సుమారు గంటకు పైగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని మహేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Also Read పార్లమెంట్ లో ‘యానిమల్’ సినిమా దుమారం.. నా కూతురు ఏడ్చింది

‘కాఫీ అండ్ చిల్. వినోదాత్మక రంగంపై అద్భుత దూరదృష్టి కలిగిన టెడ్ సరండోస్ (Ted Sarandos), అతడి బృందం మోనిక షెర్గిల్, అభిషేక్ గోరడియాతో ఆసక్తికర చర్చ జరిగింది’ అని మహేశ్ బాబు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మహేశ్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. కాగా నెట్ ఫ్లిక్స్ బృందం వరుసగా హీరోలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. నెట్ ఫ్లిక్స్ తెలుగు (Telugu) భాషపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వారితో ప్రచారం చేయిస్తోందని ఇండస్ట్రీ టాక్.

Also Read పార్టీ నాయకత్వానికి అనారోగ్యం.. గులాబీ పార్టీలో నిస్తేజం

అదలా ఉంటే నెట్ ఫ్లిక్స్ భారీ ప్రణాళికతో (Plan) రంగంలోకి దిగిందని విశ్వసనీయ సమాచారం. భవిష్యత్ లో చేయబోయే ప్రాజెక్టు కోసం తెలుగు సినీ ప్రముఖులను కలుస్తోందని చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ బృందం హైదరాబాద్ (Hyderabad)లో బిజీబిజీగా ఉంది. మరికొన్ని రోజుల్లో మరింత మంది హీరోహీరోయిన్లతో నెట్ ఫ్లిక్స్ బృందం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ వరుస భేటీల సారాంశం త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారిక సమాచారం ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button