తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nithin: ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ సెకండ్ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. వక్కంతం వంశీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా పాటను విడుదల చేయగా చాట్ బస్టర్ గా నిలిచింది.

తాజాగా సెకండ్ సాంగ్ విడుదలపై మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. బ్రష్‌ వేసుకో అంటూ సాగే రెండో పాటను నవంబర్ 10న అంటే శుక్రవారం విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. మూవీలో నితిన్‌ స్టైలిష్‌ లుక్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. అరే నువ్వొక జూనియర్ ఆర్టిస్ట్‌వి.. ఎక్స్‌ట్రాగాడివి.. ఒక ఆర్డినరీగాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. అంటూ టీజర్‌లో కొడుకు క్యారెక్టరైజేషన్‌ గురించి రావు రమేశ్‌ చెప్తున్న డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.

ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్ రాజశేఖర్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్‌ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంచ్ చేసిన పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button