తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

NTR, Ram Charan: ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సందడి.. వీడియో వైర‌ల్

గ్లోబల్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఎక్కడ కనిపించిన ఓ సెన్సేషన్ అవుతోంది. తాజాగా, వీరిద్ద‌రు బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షం కావడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా కెమెరా పనిచెప్పారు. వీరిద్దరిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారత సంపన్నుడు అంబానీ రెండో కుమారుడి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ న‌గ‌ర్ వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇంటిలో జ‌రిగే ప్రైవేట్ పార్టీ కోసం బెంగళూరు ప‌య‌న‌మ‌య్యాడు.

ALSO READ: డ్రగ్స్ కేసు.. డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

సెన్సేషన్ క్రియేట్ ..

ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. దీంతో వీరిద్దరూ గ్లోబల్ స్టార్స్ గాను గుర్తింపు ను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ అనే చిత్రంలో నటిస్తుండగా.. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రామ్ చరణ్‌కు ప్రాణ స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ కూడా మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button