తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ooru Peru Bhairavakona: యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్‌

టాలీవుడ్‌ యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రానికి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం నుంచి గతంలో ఫస్ట్ సింగిల్‌ ‘నిజమే నే చెబుతున్నా..’ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

మిలియన్లలో వ్యూస్..

‘ఊరు పేరు భైరవకోన’ నుంచి వచ్చిన ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేసింది. ఈ సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టింది. తాజాగా ఈ పాట మరో ఫీట్‌ను అందుకుంది. ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో 85 లక్షలకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో రీల్స్‌, కవర్‌ వెర్షన్స్‌ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజమే నే చెబుతున్నా జానే జానా.. నిన్నే నే ప్రేమిస్తున్నా.. అంటూ సింగింగ్‌ సెన్సేషన్‌ సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ఈ సాంగ్‌ ఆల్‌ టైమ్‌ సూపర్ హిట్స్‌ ఆల్బమ్‌ జాబితాలో చేరుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీమణి రాసిన ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజ్‌ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button