తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Perfume: ఆ సైకో ఎవరు?… ‘పర్ ఫ్యూమ్’ ట్రైలర్ రిలీజ్!

ఒక్కో సైకో కిల్లర్ ఒక్కో కారణంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఉంటారు. అలా ఈ సినిమాలో కూడా ఒక కారణంగా అమ్మాయిలను ఓ సైకో ఫాలో అవుతూ ఉంటాడు. సమయం .. సందర్భం కలిసొస్తే తన వలలో వేసుకుంటూ ఉంటాడు. ఈ సినిమా టైటిల్ ‘పర్ ఫ్యూమ్’ కావడం వలన, ఆ సైకో కొంతమంది అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు.

Also Read: అది హత్యా? ఆత్మహత్యా?… సస్పెన్స్ ను రేకేత్తిస్తున్న “ది ట్రయల్” ట్రైలర్

సైకోను వెంటడుతున్న పోలీసులు

ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది స్మెల్ బేస్డ్ థ్రిల్లర్ స్టోరీ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. స్మెల్ కారణంగా ఒక సైకో అమ్మాయిలను వెంటాడటం .. వేటాడటం .. ప్రేమ పేరుతో వేధించడం ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. అతణ్ణి పట్టుకోవడానికి పోలీస్ టీమ్ సతమతమవుతూ ఉంటుంది. చేనాగ్, ప్రాచీ థాకర్ .. అభినయ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి. స్వామి దర్శకత్వంలో జె.సుధాకర్, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది.

చిత్ర బృందం పై సుకుమార్ ప్రశంసలు

అంతకుముందు ఈ పర్‌ఫ్యూమ్ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఈ వీడియోపై ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే వీరి సక్సెస్ కన్‌ఫర్మ్‌ అయిందని చెబుతూ సినిమా స్థాయిని పెంచేశారు. మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ చాలా బాగుందని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు సుకుమార్. ఇక చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డ్‌గా అన్ని పాటలు రాయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button