తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్ డేట్ ఫిక్స్!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సైతం నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది.

ALSO READ: ఏపీలో ఆరా మస్తాన్ సర్వే ఫలితాలే నిజం కానున్నాయా?

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను సైతం త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇవాళ స్పష్టత రానుంది. ఇక దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు దీనికోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌కి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 7 నుంచే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button