తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prasanth Varma: ప్రశాంత్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్.. మూవీలో స్టార్ హీరోలు

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. టీజర్, ట్రైలర్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది.

Also read: Dil Raju: సంక్రాంతి బరి నుంచి ఆ మూవీ ఔట్.. దిల్ రాజు హాట్ కామెంట్స్

ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్ డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో ఏ ఏ హీరోకి ఏ ఏ పాత్రలు ఇవ్వనున్నారనేదానిపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మహాభారతం కోసం ప్రశాంత్ ఎంచుకున్న స్టార్ హీరోల లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో.. కృష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడి పాత్ర కోసం రామ్ చరణ్, భీముడిగా ఎన్టీఆర్, కర్ణుడు పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవి, నకులుడు పాత్రకు నాని, సహదేవుడిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడు పాత్రకు మోహన్ బాబును.. ఎంపిక చేస్తానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button