తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Diwali.. బండ్లన్నా ఏది చేసినా సంచలనమే.. ఫొటో చూస్తే వామ్మో అనాల్సిందే!

కొందరు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. వారు ఏదీ చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. అలాంటి వ్యక్తే నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేశ్. ఈయన తాజాగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ (Hot Topic)గా ఉన్న ఆయన.. మరో వార్తతో చర్చనీయాంశంగా మారాడు. ప్రతి యేటా దీపావళి (Diwali) పండుగను గణేశ్ వైభవంగా చేసుకుంటాడు. ఈ ఏడాది గతంలో కన్నా ఘనంగా చేసుకుంటున్నాడు. ఆయన పెట్టిన ఫొటో చూస్తే అలాగే కనిపిస్తోంది.

Also Read భారత క్రికెటర్ల సందడి.. రోహిత్, కోహ్లీ మధ్య నవ్వులపువ్వులు

దీపావళి పండుగ సందర్భంగా బండ్ల గణేశ్ (Bandla Ganesh) తన నివాసాన్ని టపాసులు, బాణసంచాతో నింపేశాడు. ఇంటి ఆవరణలో భారీ సంఖ్యలో బాణసంచా పరిచి ఉంచాడు. వాటి ముందు ఒక పెద్దాయనతో కలిసి గణేశ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ బాణసంచా (FireCrackers) చూస్తే అసలు కాల్చడానికి అమ్మడానికా? అనే ప్రశ్న వ్యక్తమవుతుంది. బాణసంచాకు రూ.లక్షల్లో ఖర్చు చేశాడని తెలుస్తోంది. గతేడాది కూడా ఇంత భారీ సంఖ్యలో బాణసంచా కాల్చి సంచలనం రేపాడు. ఈసారి కూడా అలాగే చేశాడు. తాజాగా అతడి నివాసంలో ఉన్న బాణసంచా ఫొటోలను చూసిన నెటిజన్లు బండ్లన్న అన్నీ టపాసులు ఏం చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు బండ్లన్న దేనిలోనూ తగ్గేదేలే అని కామెంట్లు చేస్తున్నారు. బండ్లన్న ఏది చేసినా రచ్చ రచ్చే అంటూ హీరో పవన్ కల్యాణ్ అభిమానులు అంటున్నారు.

Also Read రేవ్ పార్టీ అనేది అసత్యం.. ఖండించిన యాంకర్ హిమజ

కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలపై (Assembly Elections) స్పందిస్తూ.. ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ప్రకటించాడు. అధికారంలోకి రాకపోతే ఏదీ కోసుకోవడానికైనా సిద్ధమని ప్రకటించి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాడు. మరి బండ్లన్న అన్నట్టు కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేది డిసెంబర్ 3వ తేదీ దాక వేచి ఉండాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button