తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ram Charan: రామ్ చరణ్ మూవీలో స్టార్ హీరోయిన్ కుమార్తె?

‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 16వ ప్రాజెక్ట్‌గా ఇది సిద్ధం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ స్టార్‌ హీరోయిన్‌ కుమార్తె ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కనిపించనున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రవీనా టాండన్‌. ప్రస్తుతం సహాయ నటి పాత్రల్లో నటిస్తున్నారామె. ఇప్పుడు రవీనా కుమార్తె రాషా థడానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓ హిందీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన రాషా తాజాగా రామ్‌చరణ్‌ సినిమా కోసం రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు ఆమె శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చినట్లు పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. లుక్‌ టెస్ట్‌ కోసమే ఆమె నగరానికి వచ్చారని పలువురు మాట్లాడుకుంటున్నారు. ‘ఆమె క్యూట్‌గా ఉంది. హీరోయిన్‌గా ఆమే ఫిక్స్‌ కావాలి’ అని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

స్పోర్ట్స్‌ డ్రామాగా… గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈసినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తైన తర్వాత రామ్‌చరణ్‌ ఈ సినిమా మొదలుపెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button