తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’లో అప్పన్నగా రామ్ చరణ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది.

ALSO READ: ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్కంఠ.. ఇవాళే ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్

ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో తండ్రి పాత్ర చాలా కీలకం కానుందట. అవును.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుందట. అంతేకాదు.. ఈ సినిమాలో తండ్రిగా రామ్ చరణ్ అప్పన్న అనే పాత్రలో కనిపిస్తాడట. గ్రామీణ ప్రాంతాల్లో పంచకట్టుతో కనిపిస్తుందట ఈ పాత్ర. పొలిటికల్ లీడర్‌గా కనిపంచే ఈ పాత్రలో రామ్ చరణ్‌కు ‌నత్తి సమస్య ఉంటుందట. అదే ఈ పాత్రకు హైలెట్ కానుందని సమాచారం. ఈ పాత్ర గురించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button