తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ram Gopal Varma: ఆర్జీవీపై నాగబాబు సెటైర్లు… వైరల్ అవుతున్న పోస్ట్

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. వర్మకు ఎటువంటి ప్రమాదం రాదని, దేశంలో ఏ పనికిమాలిన వెధవా ఆయనకు హాని తలపెట్టడని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

Also Read: బిగ్ బాస్ స్పై బ్యాచ్ కొత్త సినిమా.. టైటిల్ ఏంటంటే?

డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు

వ్యూహం పేరుతో వర్మ జగన్ బయోపిక్‌ను తెరకెక్కించారు. డిసెంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో వర్మ బిజీగా ఉన్నారు. అయితే, మూవీ రిలీజ్‌పై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో తన సినిమాలతో ఆర్జీవీ సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్జీవీ..ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

Also Read: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సూపర్ స్టార్ కన్నుమూత

నాగబాబు పోస్ట్

ఈ ఉదంతంపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఆర్జీవీ పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిక వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్‌ గాడ్ని ఎవడూ చంపడు కదా! మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి’’ అని పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకున్న రానా.. కారణం ఏంటో మరి?

ఆర్జీవీ కౌంటర్

నాగబాబు సెటైర్లకు ఆర్జీవీ అదే స్థాయిలో స్పందించాడు. “సర్, నా కంటే పెద్ద కమెడియన్ ఎవరంటే, నా సినిమాలో మీరు” అంటూ పంచ్ వేశాడు. తను తీసిన వ్యూహం సినిమాలో నాగబాబు పాత్ర ఉందని, అందులో అతడు మంచి కామెడీ చేశాడని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. తన గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, తమ్ముడు పవన్ కల్యాణ్ దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోవాలని నాగబాబుకు ఉచిత సలహా ఇచ్చాడు వర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button