తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ravi Teja: భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రవితేజ.. అసలు ఏమైంది?

టాలీవుడ్ లో మాస్ మహరాజాగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. ఆయన నటించిన మూవీ వస్తుందంటే.. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలానే ఆయన తాజా సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది.

ఇక హిట్ జోడిగా పేరు తెచ్చుకున్న రవితేజ, గోపిచంద్ మలనేని కాంబోలో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో కిక్ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ కాంబోలో RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా మొదలైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. షూటింగ్ కూడా మొదలవుతుందని అంతా అనుకున్నా.. సడన్ గా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమా నుండి రవితేజ బయటకు వచ్చేశారని, ఆయన స్థానంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also read: Kalasa Trailer: కలశ ట్రైలర్ రిలీజ్.. బాగుందన్న డైరెక్టర్ గోపిచంద్

దానికి కారణం రవితేజ రెమ్యునరేషన్ అనే తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు కు రూ.100 కోట్ల వరకు బడ్జెట్ కానుందట. ఆ రేంజ్ కలెక్షన్ రావాలంటే బడా హీరోతోనే వర్కౌట్ అవుతుందని భావించిన నిర్మాణ సంస్థ సన్నీ డియోల్‌ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button