తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ravi Teja: రవితేజ మూవీకి బ్రేక్.. కారణం అదేనా?

టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.

Read also: Animal: యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘యానిమల్’.. ప్రేక్షకుల ముందుకు ట్రైలర్

కానీ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అనుకునేలోపే సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. సినిమాపై పెరిగిన బడ్జెట్.. హీరో తీసుకునే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అన్ని లెక్కలు చూసుకుంటే రూ.120 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్కి హీరో రవితేజ దాదాపు రూ.25 కోట్ల మేరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. దీంతో రిస్క్ చేయకుండా ప్రాజెక్ట్ను పక్కన పెట్టాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి.. ఇప్పటికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి కాగా.. నేటి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి.. ఈ సినిమా ముందుకు వెళ్తుందో.. ఆగిపోనుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button