తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Salaar Movie: సలార్ నుంచి వరల్డ్ ఆఫ్ ఖాన్సార్ వీడియో రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్​’ ఫేమ్​ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ అంచనాల మ‌ధ్య డిసెంబ‌ర్ 22న విడుద‌లైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది ఈ చిత్రం. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 178.7 కోట్ల గ్రాస్ అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

Also Read: కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్… యాక్షన్ సీన్స్ లో దుమ్ములేపిన ధనుష్

ఇక ఈ సినిమా చివరలోనే సలార్‌-2 గురించి అనౌన్స్‌ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం స‌రికొత్త ప్రోమో విడుద‌ల చేశారు. వ‌ర‌ల్డ్ ఆఫ్ ఖాన్సార్ పేరుతో ఈ ప్రోమో విడుద‌ల చేయ‌గా.. స‌లార్ లోని ఖాన్సార్ ప్ర‌పంచం గురించి తెలియాజేస్తూ.. ఈ వీడియో ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా సాగింది. ఈ ప్రోమో ప్ర‌స్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button