తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Salaar: ’స‌లార్` ఫస్ట్ డే కలెక్షన్లతో రికార్డులు బ్రేక్.. ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ మూవీని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. శృతి హసన్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 22న ఈ మూవీ విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ సందడే కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సలార్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేస్తున్నాడు.

ALSO READ:  హృతిక్ రోషన్ మూవీ అప్‌డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్

తొలి రోజే భారీ వసూళ్లు

సలార్‌ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్‌ రూ.180 కోట్లు వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దేశీయంగా రూ.135 కోట్లు వసూలు కావడం గమనార్హం. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్‌నిల్క్ కథనం ప్రకారం దేశీయంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. కాగా, 2023లో విడుదలైన సినిమాల్లో తొలి రోజే భారీ వసూళ్లతో రికార్డు నెలకొల్పిన సినిమాగా ‘సలార్’ నిలిచింది. అయితే ఇప్పటి వరకు దేశంలో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ రూ. 223 కోట్లు RRR మూవీ పేరిట రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, సలార్ కంటే ఒక్కరోజు ముందు వచ్చిన షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ మూవీ కలెక్షన్స్‌ పరంగా వెనుకపడింది. ఈ మూవీకి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్‌ మాత్రమే కలెక్షన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button