తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Salaar: ‘సౌండ్‌ ఆఫ్‌ సలార్’ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

టాలీవుడ్ హీరో ప్రభాస్​ ‘సలార్’ మూవీ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావులు కీలక పాత్రల్లో నటించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సలార్​ దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదిలాయి. అయితే ప్రశాంత్‌నీల్ సినిమాల్లో పాట‌ల కంటే బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ స్కోర్)కే ఎక్కువ క్రేజ్ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు సృష్టించడానికి కూడా ముఖ్య కార‌ణం బీజీఎం.

ALSO READ: ’స‌లార్` ఫస్ట్ డే కలెక్షన్లతో రికార్డులు బ్రేక్.. ఎంతంటే?

సోష‌ల్ మీడియాలో వైర‌ల్..

సలార్ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ప్ర‌భాస్ ఎంట్రీ బీజీఎం గూస్ బంప్స్ తెప్పించింది. రవి బస్రూర్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ అద్భుతమైన సౌండ్‌ ట్రాక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కాగా, సినిమా విడుదలకు ముందురోజు ఒక పాటను విడుదల చేశారు. ‘ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచగనే పుడతాడు రాజే ఒకడు.. శత్రువునే కడ తేర్చే పనిలో మన రాజు.. హింసలనే మరిగాడు.. మంచిని మరిచే…’ అంటూ వచ్చిన ఈ సాంగ్‌ చాలా హిట్‌ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button