తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Samyuktha Menon: పెళ్లిపీటలెక్కబోతున్న సంయుక్త మీనన్.. సినిమాలకు ఇక గుడ్ బై?

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపక్ష వంటి సినిమాలు హిట్ అవడంతో.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈనెల 29న విడుదల కాబోతున్న డెవిల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. ఈ అమ్మడికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also read: Devara Teaser: దేవర టీజర్ వచ్చేస్తోందా.. హింట్ ఇచ్చిన అనిరుధ్

ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న బ్యూటీ.. ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పగా వాళ్ళు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే సంయుక్త పెళ్లి చేసుకోబోయేది వేరే మతానికి చెందిన అబ్బాయిని అని సమాచారం. దీంతో పెళ్లి తర్వాత తన పేరు చివర ఉన్న ట్యాగ్ కూడా తీసేస్తుందట. అంతేకాకుండా సంయుక్త ‘డెవిల్’ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఓకే చేయలేదు. దీంతో తనకి ‘డెవిల్’ చివరి చిత్రం కావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button