తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Siren: జయం రవి మూవీ టీజ‌ర్ రిలీజ్.. పోలీస్ ఆఫీసర్‌గా కీర్తి సురేష్

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్’, ‘ఇరైవ‌న్’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా ను అనౌన్స్ చేశాడు. తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘సైరన్’. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు ఇరుంబు తిరై , విశ్వాసం, హీరో వంటి ప్రముఖ చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన సైరన్ మోషన్ పోస్టర్, సైరన్ ప్రీఫేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు.

చదవండి: రవితేజ మూవీకి సీక్వెల్.. త్వరలో ప్రకటన రానుందా?

బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌‌లో కీర్తి సురేష్

దీపావ‌ళి పండగ కానుక‌గా సైర‌న్ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తే.. కీర్తి సురేష్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగుతుండగా.. జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు. జ‌యం ర‌వి జైలు నుంచి విడుద‌లైన అనంత‌రం త‌న ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ ప్రోమోలో జ‌యం ర‌వి ర‌గ్గ‌డ్ లుక్‌లో అల‌రించాడు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది. అలాగే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, తులసి తదితరులు నటించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం వహించగా.. సెల్వ కుమార్ ఎస్.కె సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button