తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

SK23: మురుగదాస్, శివ కార్తికేయన్ కాంబోలో కొత్త సినిమా.. షూటింగ్ ప్రారంభం

తమిళ స్టార్ ద‌ర్శ‌కుడు మురుగదాస్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ఆయన తన కెరియర్‌లో ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. కాగా, ఆయన తెరకెక్కించిన గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలు ఇండ‌స్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక తెలుగులో చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్, హిందీలో అమీర్ ఖాన్‌తో గజిన్ రీమేక్ చేశారు. తాజాగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో మురుగదాస్ ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ALSO READ: హృతిక్ రోషన్ కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

చెన్నైలో షూటింగ్‌..

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో మురుగుదాస్ ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌నున్నారు. ఎస్‌కే23 అని వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌.. గురువారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ఓ మంచి కథను రెడీ చేయగా.. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button