తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Hrithik Roshan: హృతిక్ రోషన్ కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కారణం తెలియదు కానీ, ఆయన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడుముకి పట్టీతో, రెండు చేతుల కింద క్రచెస్‌ వేసుకొని కనిపించారు. దీంతో హృతిక్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తే ఆయనకు బలమైన గాయాలే అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన హృతిక్ సుదీర్ఘమైన తన అనుభవాన్ని రాసుకొచ్చాడు.

Also read: Yash: జై హనుమాన్ మూవీలో హీరో యశ్.. త్వరలో మూవీ టీం క్లారిటీ

గతంలో మీకు ఎప్పుడైనా వీల్ చైర్, క్రచెస్‌ వాడాల్సిన అవసరం వచ్చిందా? అప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? గాయాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తొందరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ కూడా హృతిక్ తొందరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హృతిక్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వార్2 సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరెకెక్కిస్తున్న ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా హృతిక్ గాయాల కారణంగా ఇంకా మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button