తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

SSRMB: రాజమౌళి- మహేష్ మూవీ టైటిల్ ఇదేనా.. నెట్టింట చక్కర్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రకటన తర్వాత భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఇప్పటి నుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని విధంగా ఉండనుందని అందరు భావిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవర్ ఫుల్ కథను ఇప్పటికే సిద్ధం చేశారట.

Also read: Vijay Devarakonda: రష్మికకు అరుదైన గౌరవం.. విజయ్ దేవరకొండ వైరల్ పోస్ట్

SSRMB వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ కూడా క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రేడ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైటిల్ ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ఇదే టైటిల్ ను మహేష్ బాబు సినిమాకు ఫిక్స్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మహారాజా టైటిల్ పై అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియన్స్ కూడా అంత సంతృప్తిగా లేరని అర్థమవుతోంది. మహారాజ టైటిల్ బయటకు వచ్చిన సమయం నుండి ఫ్యాన్స్ ఒకటే మాట అంటున్నారు. మహేష్, రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాకు ఉండాల్సిన రేంజ్ లో టైటిల్ లేదు. ఇంకా చాలా టైం ఉంది కదా ఎందుకు తొందర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమందేమో ఎక్కడో కొడుతోంది జక్కన్నా.. తొందరపడకండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button