తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sudheer Babu: ఇవాళ ‘హరోం హర’ ప్రీ రిలీజ్ వేడుక.. గెస్టులు ఎవరో తెలుసా!

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరో సుధీర్ బాబు. ‘ప్రేమ కథా చిత్రం’ తర్వాత సుధీర్ బాబుకు మళ్లీ ఆ స్థాయి హిట్ రాలేదు. ప్రతి సినిమాకు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నా ప్రేక్షకుల ఆదరణ మాత్రం దక్కడం లేదు. ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’ జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.

ALSO READ: విస్తరిస్తున్న నైైరుతి రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు

అయితే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు. .ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్స్ సిద్ధూ జొన్నలగడ్డ, అడివి శేష్, విశ్వక్ సేన్ గెస్టులుగా రానున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button