తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Suhas: సుహాస్ కొత్త సినిమా ‘గొర్రెపురాణం’ అప్డేట్.. ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్

వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన సుహాస్.. టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గ‌త వారం విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక కథల విషయంలో కమాండ్, డెసిషన్ మేకింగ్ ఫర్ఫెక్ట్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ‘గొర్రెపురాణం’ అంటూ మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ALSO READ: ఫ్యామిలీ స్టార్ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

నిబ్బా, నిబ్బీలకు కాదు..

చంచల్ గూడలో ఉన్న ఏ1 ఏసుకు కోర్టు బెయిల్ నిరాకరించింది అంటూ గ్లింప్స్ మొద‌ల‌వుతుంది. ఆ తర్వాత గొర్రెను సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొస్తూ చూపించారు. అయితే ఇక్కడ ఏసు అంటే ఎవరు? గొర్రెను జైలులోకి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏసు అంటే గొర్రేనా? ఇందులో సుహాస్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. గొర్రెపురాణం అని టైటిల్ పెట్టారంటే కథ మొత్తం ఆ గొర్రె చుట్టూనే తిరుగుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా చివరిలో నిబ్బా, నిబ్బీలకు కాదు అంటూ క్యాప్షన్ పెట్టడం మరింత ఆసక్తిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button