తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tantra Movie: పిల్ల‌బ‌చ్చాలు రావొద్దు.. ‘తంత్ర’ సినిమాకు ఏ సర్టిఫికెట్

మల్లేశం, వకీల్‌సాబ్‌ ఫేమ్ ‘అనన్య నాగళ్ల’ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తంత్ర’. ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య నాగళ్లకి జోడీగా దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి నటిస్తున్నాడు. అలాగే ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ALSO READ: గోపీచంద్‌ మూవీ అప్డేట్.. ట్రైల‌ర్‌ రిలీజ్ ఎప్పుడంటే.?

మాది ఏ సర్టిఫికెట్ సినిమా..

సెన్సార్ స‌భ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా మార్చి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే పిల్ల‌బ‌చ్చాలు ఈ సినిమాకు రావొద్దు. ఎందుకంటే మాది ఏ సర్టిఫికెట్ సినిమా అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. కాగా, హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు.

One Comment

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button