తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

True Lover: ఓటిటిలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మణికందన్‌, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్. ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ట్రూ లవర్‌గా డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేశారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. అపనమ్మకం, అభద్రతా భావంతో కూడిన ఏ ప్రేమ నిలబడదనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Also read: Hrithik Roshan: హృతిక్ రోషన్ కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

ట్రైలర్‌, టీజర్స్‌తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. తమిళంలో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. తమిళంలో లవర్ మూవీ రజనీకాంత్ లాల్ సలామ్ కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఆరు రోజుల్లో ఈ మూవీ 10 కోట్ల వరకు గ్రాస్‌, నాలుగున్నర కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ట్రూ లవర్‌లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ భామ వైజయంతీ మూవీస్‌లో వచ్చిన ‘మెయిల్ ‘మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే మ్యాడ్‌ మూవీతో తెలుగులో పెద్ద హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే ట్రూ లవర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళం, తెలుగు స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందిన ట్రూ లవర్ మూవీ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button