తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Yatra 2: యాత్ర-2 టీజర్‌ వచ్చేసింది.. దుమ్ము రేపుతున్న విజివల్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే 2019 ఏపీ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. అయితే గతంలో కూడ రాజకీయ కోణంలో వచ్చిన సినిమాలు ఎన్నికలకు ముందు విడుదల కావడం ఆంధ్రప్రదేశ్‌లో ఆనవాయితీగా కొనసాగుతోంది. తాజాగా, ఈ యాత్ర చిత్రానికి సీక్వెల్‍గా యాత్ర-2 వస్తోంది. ఈ సినిమాను మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‍ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ ఆధారంగా ‘యాత్ర-2’ రూపొందుతోంది. ఇందులో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుతోపాటు 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ సంఘటనలను చూపించనున్నారు. తాజాగా, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ALSO READ:  ‘గుంటూరు కారం’ సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్.. పోస్టర్ వైరల్

టీజర్‌లో ఏముందంటే?

ఏమన్నా.. ఇంత రాత్రి అయింది. నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావ్.. అని కళ్లు లేని ఓ వ్యక్తిని అడిగే మాటతో టీజర్ మొదలవుతోంది. ‘మా వైఎస్సార్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురుచూస్తున్నా.. అని చెబుతాడు. దీనికి జగన్ కాదన్నా..వైఎస్సార్ కొడుకు మీ ముందుకొచ్చి నిల్చున్నా మీకు కనపడదు కదా! అని అడగగా.. అన్నా నాకు ఆయన కనపడకపోయినా.. నేను ఆయనకు కనబడతా.. , నాళ్లాంటోళ్లు ఆయన వెనక ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నా అని చెబుతాడు. బాబు చెప్పే ‘తండ్రి పోయాడు అనుకుంటే.. కొడుకు వచ్చాడు’ అనే డైలాగ్ సినిమా కే హైలెట్. తర్వాత ‘ఉన్నదంతా పోయిన పర్లేదు అని తెగించిన జగన్ లాంటి వాళ్లతో యుద్ధం చేయడం మనకే కష్టం మేడం’ అంటూ సోనియాతో పార్టీ నాయకులు చెబుతారు. ఇక జగన్ ‘చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా.. కానీ ఒకవేళ గుర్తు పెట్టుకుంటే.. తండ్రి కోసం ఇచ్చే మాటను తప్పని కొడుకుగా.. మీరన్నా ఆ చరిత్రను గుర్తుపెట్టుకుంటే చాలు అన్నా..’ అంటూ చెప్పే డైలాగ్ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. అసెంబ్లీలో ‘నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో నా రాజకీయమేంటో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి… నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’ అంటూ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కొడాలి నానితో వైఎస్సార్ ‘నా రాజకీయ ప్రత్యర్థి అయినా శత్రువు అయినా ఓడించాలని అనుకుంటా.. కానీ మీ నాయకుడిలా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ అనే డైలాగ్ సూపర్ అని చెప్పాలి.

ALSO READ:  సంక్రాంతి బరి నుంచి ఆ మూవీ ఔట్.. దిల్ రాజు హాట్ కామెంట్స్

అదిరిపోయిన యాక్టింగ్..

ఈ టీజర్‌లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు. అయితే ఇందులో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‍ పాత్రలో జీవా యాక్టింగ్ అదిరిపోయింది. ఇక ఈ చిత్రంలో వైఎస్ భారతిగా మరాఠీ నటి కేతకి నారాయణన్‌, సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెట్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 8న యాత్ర-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, 2019 ఎన్నికల ముందు కూడా రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలు విడుదల కాగా, యాత్ర సినిమా మాత్రం మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల కంటే ముందే యాత్రకు సీక్వెల్‌గా యాత్ర-2 విడుదల కావడంతో వైసీపీ అభిమానుల్లో కొత్త జోష్ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button