తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Fake Video: విజయ్ దేవరకొండపై అసభ్య వీడియో.. యూట్యూబర్ అరెస్ట్

ఇటీవల సినీ నటీనటులపై కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యంగా చిత్రీకరిస్తున్న సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు అగ్ర హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఓ హీరోయిన్ తో విజయ్ కలిసి ఉన్న వీడియోను అసభ్యకరంగా చిత్రీకరించి యూట్యూబ్ (YouTube)లో అప్ లోడ్ చేశారు. దీనిని చూసిన విజయ్ దేవరకొండ టీమ్ పోలీసులకు (Police) ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..

Also Read కాంగ్రెస్ కు సమయమేది? 10 రోజులకే విమర్శలా?

ఇటీవల విజయ్ దేవరకొండతో కలిపి ఓ హీరోయిన్ (Heroine)ను అసభ్యకరంగా వీడియోను రూపొందించారు. ఆ వీడియోను యూట్యూబ్ లో ఓ యూట్యూబర్ విడుదల చేశాడు. అది వైరల్ (Viral) కావడంతో విజయ్ టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే విజయ్ దేవరకొండ బృందం ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యూట్యూబర్ (Youtuber)ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యూట్యూబ్ లో నుంచి ఆ వీడియోను పోలీసులు తొలగించారు. మరోసారి ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అతడిని వదిలేశారు.

Also Read పటేళ్ల పాలన కాదు.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య అందించాలి

నిందితుడు ఎవరంటే..?
ఏపీలోని అనంతపురానికి చెందిన వెంకట కిరణ్ గా పోలీసులు గుర్తించారు. అతడు ‘సినీపోలిస్’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడని తెలిసింది. హైదరాబాద్ సైబర్ పోలీసుల ఫిర్యాదుతో స్పందించిన అనంతపురం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మందలించి వదిలేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button