తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Yatra: అచ్చం సీఎం జగన్ సతీమణి భారతిలాగే.. యాత్ర-2 పోస్టర్ విడుదల

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందించిన ‘యాత్ర’ (Yatra) సినిమా విజయవంతం కాగా.. దానికి సీక్వెల్ ‘యాత్ర-2’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో యాత్ర 2కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ (Update) చిత్ర బృందం నుంచి వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రగా ఉన్న వైఎస్ భారతి (YS Bharathi) పాత్రను రివీల్ చేశారు. ఆమె పాత్రలో చేస్తున్న హీరోయిన్ లుక్ ను విడుదల చేశారు. ఆ ఫొటో చూస్తే అచ్చం సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సతీమణి భారతి మాదిరే ఉంది. దీంతో ఈ అప్డేట్ ఏపీవాసులను ఆకట్టుకుంటోంది.

Also Read శస్త్ర చికిత్స విజయవంతం.. లేచి నడుస్తున్న కేసీఆర్

వైఎస్సార్ (YSR) పాదయాత్ర నేపథ్యంలో యాత్ర-1 తీయగా.. ఇప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర ఇతివృత్తంతో యాత్ర-2 తీస్తున్నారు. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వంలో త్రీ ఆటమ్స్ లీవ్స్, వీ సెల్యులాయిడ్, శివ మేక సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా (Jeeva) నటిస్తుండగా భారతి పాత్రలో కేతిక నారాయణ్ (Ketaki Narayan) నటిస్తోంది. వైఎస్ భారతి జన్మదినం (9 డిసెంబర్) సందర్భంగా సినిమాలో భారతి పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘నిజమేన్నా, మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడ్డం కూడా నేర్పించలేదు’ అనే డైలాగ్ చెబుతూ పోస్టర్ ఉంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Also Read రాజీనామాల పర్వం.. ఎమ్మెల్సీ పదవులకు కౌశిక్, కడియం, పల్లా రాజీనామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button