తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Assembly Session: ప్రతీ ఏటా రూ.13వేల కోట్ల నష్టం.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. ముఖ్యంగా కరోనా కారణంగా ఆదాయం బాగా తగ్గడంతోపాటు ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో అప్పులు కూడా పెరిగాయన్నారు. రెండు ఆర్థిక సంవత్సరాలు సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. మూడేళ్లలో రాష్ట్రం రూ.66 వేల కోట్లు ఆదాయం నష్టపోయిందన్నారు.

ALSO READ: అసెంబ్లీలో రచ్చరచ్చ..టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

తగ్గిన కేంద్రం వాటా..

ఐదేళ్లలో చూసిన అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా (డెవల్యూషన్స్‌) తగ్గిపోయాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పాలన కాలంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో మన రాష్ట్రంతోపాటు అన్ని రాష్ట్రాలకూ తగ్గాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో 2018 – 19లో 32,780 వేల కోట్లు, 2019- 20లో 28,000 కోట్లు, 2020-21లో 24,000 కోట్లు, 2021-22లో 36 వేల కోట్లు, 2022-23లో 38,000 కోట్లకు చేరుకుందన్నారు.

ALSO READ: టీడీపీతో జనసేన పొత్తు.. సీట్లు, సీఎం పదవిపై చర్చ!

హైదరాబాద్ కోల్పోవడంతోనే..

తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ అని, ప్రతి రాష్ట్రానికి ఎకనామిక్ పవర్ హౌస్ లేకుంటే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోవడంతో ప్రతీ ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోతున్నామన్నారు. ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందని, ప్రతీ రాష్ట్రానికి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలని తెలిపారు. అందుకే నేను పదే పదే విశాఖను ప్రస్తావిస్తూ వస్తున్నాను అని చెప్పారు. విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయలు రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించామన్నారు. ఇప్పుడు మనం చేసిన 2,91,000 కోట్ల అప్పును ఒకరు 13 లక్షల కోట్లు అంటారని జగన్ వెల్లడించారు.

ALSO READ: పీఎం-కిసాన్ సాయం పెంపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఎక్కడా అవినీతికి తావివ్వలేదు

57 నెలల ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదని, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతీ రూపాయి ప్రజలకు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.2 లక్షల 55 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని తెలిపారు. అలాగే నాన్‌ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించామని వెల్లడించారు. పది సంవత్సరాల బ్యాంక్‌ అకౌంట్‌లో బాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వారికి చేరిందా అని వాళ్లనే చూసుకోమంటున్నాను అని జగన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button