తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Cabinet: కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లక్షలాది మంది అతిథుల మధ్యలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది చేత గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు.

ALSO READ: విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు

మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మిగతా సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది.

నూతన మంత్రులు వీరే..

  1. పవన్‌ కల్యాణ్‌ (జనసేన)
  2. నారా లోకేశ్‌ (టీడీపీ)
  3. అచ్చెన్నాయుడు (టీడీపీ)
  4. కొల్లు రవీంద్ర (టీడీపీ)
  5. నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
  6. పి. నారాయణ (టీడీపీ)
  7. వంగలపూడి అనిత (టీడీపీ)
  8. సత్యకుమార్‌ యాదవ్‌ (బీజేపీ)
  9. నిమ్మల రామానాయుడు (టీడీపీ)
  10. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌ (టీడీపీ)
  11. ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ)
  12. పయ్యావుల కేశవ్‌ (టీడీపీ)
  13. అనగాని సత్యప్రసాద్‌ (టీడీపీ)
  14. కొలుసు పార్థసారథి (టీడీపీ)
  15. డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ)
  16. గొట్టిపాటి రవి (టీడీపీ)
  17. కందుల దుర్గేశ్‌ (జనసేన)
  18. గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)
  19. బీసీ జనార్దన్‌రెడ్డి (టీడీపీ)
  20. టీజీ భరత్‌ (టీడీపీ)
  21. ఎస్‌.సవిత (టీడీపీ)
  22. వాసంశెట్టి సుభాష్‌ (టీడీపీ)
  23. కొండపల్లి శ్రీనివాస్‌ (టీడీపీ)
  24. మందిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి (టీడీపీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button