తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Cabinet: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల్ని కేటాయించారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖల్ని కేటాయించారు. అందరూ అనుకున్నట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం, పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలైన పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖలు, పర్యావరణ, అటవీశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు దక్కాయి. సాధారణ పరిపాలన, శాంతిభదత్రల శాఖలు సీఎం చంద్రబాబు వద్దే ఉండనున్నాయి.

మంత్రులకు కేటాయించిన శాఖలివే!

వంగలపూడి అనిత-హోంశాఖ
నారా లోకేష్‌- మానవ వనరులు,ఐటీ కమ్యూనికేషన్స్‌
ఆనం రాంనారాయణరెడ్డి-దేవాదాయ శాఖ
నిమ్మల రామానాయుడు- జల వనరుల శాఖ
నాదెండ్ల మనోహర్‌- పౌర సరఫరాల శాఖ
పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి శాఖ
కింజరాపు అచ్చెన్నాయుడు- వ్యవసాయశాఖ
డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ
ఎన్‌ఎండీ ఫరూక్‌- మైనార్టీ వెల్ఫేర్‌, న్యాయ శాఖ
కొలుసు పార్థసారధి-హౌసింగ్‌, సమాచార శాఖ
గొట్టిపాటి రవికుమార్‌- విద్యుత్‌శాఖ
పయ్యావుల కేశవ్‌- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు
కందుల దుర్గేష్‌- పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ
వాసంశెట్టి సుభాష్‌-కార్మిక శాఖ
అనగాని సత్యప్రసాద్‌-రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి- రవాణా, యువజన,క్రీడల శాఖ
టీజీ భరత్‌- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
సత్యకుమార్‌- వైద్య, ఆరోగ్యశాఖ
కొల్లు రవీంద్ర-ఎక్సైజ్‌, గనుల శాఖ
బీసీ జనార్థన్‌రెడ్డి- రోడ్లు, భవనాలు, లిక వసతులు, పెట్టుబడుల శాఖ
గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన శాఖ
ఎస్‌.సవిత- బీసీ సంక్షేమం, చేనేత, ఔళి శాఖ
కొండపల్లి శ్రీనివాస్‌- ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button