తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Education: ఏపీలో కొత్త ఒరవడి.. విద్యపై ఇండియా టుడే సదస్సు

ఏపీ విద్యారంగంలో తీసుకొచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్‌ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యారంగంలో తీసుకొచ్చిన నూతన విధానం, మన బడి నాడు – నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌తో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ పలు ప్రశ్నలు అడిగారు.

ALSO READ: వైసీపీ మాస్టర్ ప్లాన్ …రాజ్యసభ సీట్లపై ఫోకస్

ఒక పేజీలో తెలుగు.. మరో పేజీలో ఇంగ్లీష్‌

తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరమని ఇండియా టుడే ప్రతినిధులు అన్నారు. ఆ తర్వాత జగన్‌తో ఇంటర్వ్యూలో భాగంగా.. మూడో తరగతి నుంచే గ్లోబల్‌ ఎగ్జామ్‌ టోఫెల్‌ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయని, తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? అని అడిగిన ప్రశ్నకు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని జగన్ సమాధానం ఇచ్చారు. అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? అని అడగగా.. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్‌ పెట్టడంతోపాటు బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్‌ అంశాలను చేర్చినట్లు చెప్పారు.

ALSO READ: మరో కల సాకారం.. పూర్తయిన ‘వెలిగొండ’ ప్రాజెక్టు పనులు

దశలవారీగా ఐబీ సిలబస్‌

ఐబీ సిలబస్‌ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డుతో చేతులు కలిపిందని, ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నామని జగన్ తెలిపారు. జూన్‌ 2025 తర్వాత మొదటి తరగతిలో ఆ తర్వాత దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతామన్నారు. దీంతో ఐదేళ్ల తర్వాత రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్‌ సర్టిఫెకెట్‌ కోసం పోటీ పడనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: మైనింగ్‌లో ఏపీ అదుర్స్..దేశంలోనే మూడో స్థానం

డ్రాపవుట్లను అరికట్టేందుకే..

అధికారంలోకి వచ్చే సమయంలో రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉందని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్న భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్‌ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని జగన్ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైందని, గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నామని వెల్లడించారు. కాగా, 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48 ఉండగా.. ప్రస్తుతం జాతీయ సగటు 99.21గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button