తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్..జనసేనలో నైరాశ్యం!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ భారీ సభలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న విశాఖ జిల్లా భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సభలు సైతం సక్సెస్ కావడంతో సీఎం జగన్ ప్రజా క్షేత్రంలో దూసుకు­పోతున్నారు. ఈ సభలను జగన్ ముందుండి, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సూపర్ హిట్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

ALSO READ: సొంతగూటికి వచ్చేస్తోన్న సీనియర్ ఎమ్మెల్యే.. ఆయనకేనా టికెట్?

జనసేనానికి వీడని బద్ధకం..

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ సామాజిక న్యాయమే పరమావధిగా శాస­న­సభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియా­మకంతో పాటు ప్రచారంలోనూ పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతోంది. మరోవైపు ‘రా…కదిలి రా’ అంటూ శంఖారావం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్‌లతో కలిసి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుండగా.. టీడీపీ మిత్రపక్షమైన జనసేనానికి మాత్రం బద్ధకం వీడడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు పట్టుమని 90 రోజులు కూడా లేదు. కానీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్ని డ్రామాలు ఆడాలో.. అన్నీ ఆడేస్తున్నారు. ఇప్పటికీ క్యాడర్ నుంచి ఎవరు పోటీ చేస్తారో.. ఎక్కడి నుంచి చేస్తారో అనే విషయాలపై స్పష్టత లేకపోవడంతో జనసేన సైనికుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ALSO READ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌‌పై BIG UPDATE!

రోజుకో నాటకం..

టీడీపీ, జనసేన పొత్తులపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ఇప్పటికీ టిక్కెట్లు ఖరారు కాలేదు. ఈ తరుణంలో కేడర్‌ చేజారిపోకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పేరుతో రోజుకో నాటకం ఆడుతున్నారు. ఇటీవల బీజేపీతో పొత్తు పేరిట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మంతనాలు కొనసాగించారు. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button