తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: ఉపాధి వనరుల్లో ఏపీ సరికొత్త రికార్డు.. దేశంలో ఎన్నో స్థానమంటే?

రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వరకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతోపాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. శిక్షణ పొందిన యువతకు సైతం ఉద్యోగాలు పొందడంలో అవసరమైన సహకారం అందిస్తోంది. ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఆంగ్లం, న్యూమరికల్, క్రిటికల్‌ థింకింగ్, కంప్యూటర్‌ నైపు­ణ్యాల్లో అత్యు­త్తమ ప్రదర్శన కనబర్చడంతో యావత్‌ దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో దేశంలోనే ఉపాధి వనరుల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది.

ALSO READ: పవన్ కల్యాణ్‌కు కొత్త టెన్షన్.. ‘జనసేన’ పేరిట మరోపార్టీ!

మెరుగైన ర్యాంకుపై నిపు­ణు­ల హర్షం

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల విస్తృతిలో సమతుల్యతను ప్రదర్శిస్తోంది. గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగయ్యాయి. గతేడాది 65.58 శాతం ఉండగా.. తాజా­గా 72.38 శాతంతో 3వ స్థానానికి చేరుకుందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 76.47శాతంతో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో 73.03 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణలో 67.79శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ మెరుగైన ర్యాంకు సాధించడంపై నిపు­ణు­లు హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ: కేంద్ర పథకాలకు… రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు.. పురందేశ్వరి ఎద్దేవా

సీఎం జగన్.. దూరదృష్టి

దూరదృష్టితో సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారని.. ఆయన ఆలోచనలకు తగిన విధంగా శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని నిపు­ణు­లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పరిశ్రమలకు తగ్గట్టుగా భవిష్యత్‌ నైపు­ణ్యాలు కలిగిన మానవ వనరులు, ఇంటర్న్‌షిప్‌ కోరుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేక సదుపాయం, ఆ విద్యార్థులను ‘కృతిమ మేధ’ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతోంది. కాగా, ఆ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఇండియా స్కిల్స్‌ నివేదిక ద్వారా వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button