తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

రేషన్‌కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పౌష్టికాహార భద్రత లక్ష్యంగా ప్రజల కోసం మార్చి 1నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాగిపిండి మార్కెట్‌ల్లో కిలో రూ.40లు పలుకుతుండగా.. ఏపీ ప్రభుత్వం కేవలం రూ.11లకే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు.

ALSO READ: కుప్పం బరిలో నిలబడ్తా.. మద్దతు ఇస్తారా?

ఒక్కో కార్డుకు కిలో రాగిపిండి

ప్రస్తుతం రేషన్‌ లబ్దిదా­రులకు ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో వస్తువు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒక్కో కార్డుకు కిలో రాగిపిండిని పంపిణీ చేయనుంది. అందజేస్తోంది. కాగా, ఇప్పటికే శ్రీసత్యసాయి, పా­ర్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా­ల్లో రాగులు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో జొన్నలను కొనుగోలు చేస్తోంది.

ALSO READ: మేడారానికి పోటెత్తిన భక్తులు.. అన్ని ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం

మొదట ఈ జిల్లాల్లోనే పంపిణీ..

రేషన్‌ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అ­ల్లూ­రి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో పంపిణీ చేయనున్నారు. అలాగే రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాగులను ప్రాసెసింగ్‌ చేసి.. పిండి ఆడించి, ప్యాకింగ్, రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button