తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: ప్రజల ముంగిటకే వైద్య సేవలు.. దేశంలోనే ఏపీ టాప్

రాష్ట్రంలో వైద్య సేవలు విస్తరించేందుకు ఏపీ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు నాడు-నేడు పేరుతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. వీటితో పాటు డిజిటల్ వైద్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పేపర్ లెస్ ట్రీట్ మెంట్, టెలీమెడిసన్ సేవలను విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా టెలిమెడిసన్ సేవల్లో ఏపీ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ALSO READ: సీఎం కేసీఆర్‌కు షర్మిల అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలుసా?

ఇంటికి చేరువలోనే వైద్య సేవలు

ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజలకు ఏలాంటి ఖర్చు లేకుండా ఇంటికి చేరువలో వైద్య సేవలు అందించేందుకు సీఎం జగన్‌ వైద్య, ఆరోగ్య శాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. మొదట ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో వైద్యులనే గ్రామాలకు పంపి, ప్రజల ముంగిటకే వైద్య సేవలను తీసుకెళ్లింది. ఈ మేరకు మారమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 2019 నవంబర్‌లో ఈ-సంజీవని పేరుతో టెలీమెడిసన్ సేవలను ప్రారంభించారు. అయితే కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని టెలీమెడిసన్ సేవలు అందించగా.. మంచి ప్రావీణ్యం సాధించింది. అదేవిధంగా పీహెచ్‌సీల నుంచి జిల్లా ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రుల వరకు అన్ని ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు.

ALSO READ: సొంత పార్టీ నేతలకు జనసేన అధినేత వార్నింగ్!

రోజుకు 70 వేల కన్సల్టేషన్లు

2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదయ్యాయి. కాగా, ఇందులో 25 శాతం ఏపీ నుంచే ఉండగా.. దాదాపు 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. సగటున రోజుకు 70 వేల కన్సల్టేషన్లు నమోదు కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1.64 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఏపీ తర్వాత 2.60 కోట్లతో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో ఉంది.

ALSO READ: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే సరుకులు

ప్రత్యేకంగా 27 హబ్‌లు

టెలీమెడిసన్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం 27 హబ్‌లను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు రాష్ట్రంలోని 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లను ఎటాచ్ చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులతోపాటు ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లను అందుబాటులో ఉంచింది. అయితే రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమున్న సందర్భాల్లో టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు తెలియజేసి మందులు సూచిస్తారు. ఆ మందులను పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఇంటి నుంచే ఈ-సంజీవనీ యాప్ ద్వారా నేరుగా టెలీమెడిసన్ సేవలు పొందే అవకాశం ఉండగా.. స్మార్ట్ ఫోన్ లేని రోగులకు ఆశావర్కర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి మెడికల్ హబ్‌ను సంప్రదించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button