తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: విద్యా దీవెన సక్సెస్.. భారీగా ఉద్యోగాలు

పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరంగా కాకుండా సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న విద్యాదీవెన పథకం దిగ్విజయంగా అమలవుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం వందశాతం ఫీజులను చెల్లించడంతోపాటు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రముఖ సంస్థలతో ఉచితంగా నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తోంది. దీంతో రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు.

ALSO READ: చంద్రబాబు సభల్లో కనిపించని జనం.. కారణం అదేనా?

భారీ మార్పులకు శ్రీకారం..

అధికారం చేపట్టిన తొలి ఏడాదే నుంచే సీఎం వైఎస్‌ జగన్‌ విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించారు. దీంతో పాటు ఏపీ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఇంజనీరింగ్‌ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను అందించడానికి 30కిపైగా ప్రపంచ స్థాయి సంస్థలు, మరో 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. దీంతో ఇప్పటివరకు 10 లక్షల మంది లబ్ధి పొందారు.

ALSO READ: యాత్ర-2 నుంచి మరో పాట రిలీజ్.. ఎప్పుడంటే!

‘ఫ్యూచర్‌ స్కిల్స్‌’లో ఏపీ టాప్

దేశంలోనే ఫ్యూచర్‌ స్కిల్స్‌ అందించడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఇందులో పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టుగా ఫ్యూచర్‌ స్కిల్స్‌ కలిగిన మానవ వనరులను సృష్టిస్తుంది. దీంతో అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో కొనసాగుతోంది. కాగా, గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపర్చుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. మరో వైపు 2018-19లో రాష్ట్రంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య 37 వేలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button