తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

HanuMan: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ఎప్పుడంటే?

ప్రశాంత్‌ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌‌లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.డ మొదటి షో నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. హనుమాన్‌ సినిమా ఓటీటీకి సంబంధించి రిలీజ్ డేట్‌ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి రెండో వారంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

ALSO READ: ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ మూవీగా 12th ఫెయిల్

అమెరికాలోనూ భారీ కలెక్షన్స్

సాధారణంగా సినిమా రిలీజైన మూడు వారాల్లో ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్ వస్తుండడంతో 55 రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఇంకా థియేటర్స్‌లో హనుమాన్ గ్రేస్ తగ్గడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button