తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: టీడీపీ, జనసేన విభేదాలు తారాస్థాయికి.. కారణం ఇదేనా!

ఏపీలో త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ, జనసేన పొత్తు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల పంపిణీపై లెక్కలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య పొత్తు సంగతి తేేలినా సీట్ల పంపకాల లెక్కలు మాత్రం తేలలేదు. అయితే జనసేన పార్టీ అధినేత తమ పార్టీకి సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే కోరినట్లు సమాచారం. అదే విధంగా ఆయన టీడీపీ ముందు రెండు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేన 68 అసెంబ్లీ స్థానాల జాబితాను ఇచ్చి వాటిలో 45 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని, 2019లో టీడీపీ గెలిచిన 23 అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండు సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని పవన్‌ ప్రతిపాదించారని సమాచారం.

ALSO READ: ఏపీలో కొత్త ఒరవడి.. విద్యపై ఇండియా టుడే సదస్సు

పవన్‌ కోరిన నియోజకవర్గాల జాబితా ఇదే!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, ఉమ్మడి విశాఖ పట్నం జిల్లాలోని పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక, ఉమ్మడి తూర్పు గోదావరిలోని పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట, ఉమ్మడి కష్ణా, గుంటూరు జిల్లాలోని విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం స్థానాలను జనసేన డిమాండ్ చేసినట్లు సమాచారం.

ALSO READ: వైసీపీ మాస్టర్ ప్లాన్ …రాజ్యసభ సీట్లపై ఫోకస్

చిచ్చురేపుతున్న ప్రతిపాదనలు!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే స్థానాలను జనసేన కేటాయించాలనే ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో చిచ్చురేపుతున్నాయి. ఈ తరుణంలో రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో వైపు బీజేపీతో కూడా పొత్తు ఆలోచనలో టీడీపీ నేత చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంకా కొంత సమయం వేచి చూడాలని చంద్రబాబు పవన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చేవరకు సీట్ల పంపకాలపై తేలే అవకాశం లేకపోవడంతో అటు టీడీపీ, ఇటు జనసేన అభ్యర్థుల్లో ప్రతిష్టంభన కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button