తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నుంచి కీలక నేతలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య జంపింగ్ జపాంగ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల వైసీపీ చేపట్టిన ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో టికెట్ కోల్పోయిన వారితోపాటు మరికొంతమంది తిరిగి సొంత పార్టీ వైపు చూస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీకి గుడ్ బై చెప్పిన వారు సైతం తిరిగి వైసీపీలోకి వస్తుండగా.. మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటిలోకి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ALSO READ: వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్..జనసేనలో నైరాశ్యం!

టీడీపీ నుంచి వైసీపీలోకి..

నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మచిలీపట్టణం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితతోపాటు కుటుంబ సభ్యులు వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ, మైదుకూరు నుంచి రెడ్యమ్ వెంకట సుబ్బారెడ్డితోపాటు కడప జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగే అవకాశం ఉంది. కాగా, మరోవైపు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో చర్చలు జరుగుతున్నాయి. వీరంతా త్వరలోనే వైసీపీలో చేరనున్నారని సమాచారం.

ALSO READ: నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు

ఇది ఆరంభం మాత్రమే..

టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా మున్ముందు టీడీపీ నుంచి భారీగా వలసల పర్వం కొనసాగుతోందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కాగా, ఇటీవల సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మూడు సిద్ధం సభలు సక్సెస్ కావడం, టీడీపీ, జనసేన నాయకుల్లో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ఇంకా చాలామంది నాయకులు వైసీపీలోకి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. అదే విధంగా పవన్‌, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌కు తిరుగు లేదని, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారన్నారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button