తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Chaari 111: వెన్నెల కిశోర్ మూవీ అప్డేట్.. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

టాలీవుడ్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చారి 111’. ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తుండగా..అదితి సోనీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్‌ టీజర్‌‌తోపాటు ట్రైల‌ర్ విడుద‌ల చేయగా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా, మేకర్స్ మరో అప్డేట్ ప్రకటించారు.

‘చారి… బ్రహ్మచారి’

ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి, సరస్వతి పుత్ర రాసిన ఈ పాటను జవాన్ ఫేమ్ సంజీత్ భట్టాచార్య పాడింది. సిమన్ కె కింగ్ స్వరాలు అందించిన ఈ సినిమాను బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button