తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Putin: బలపడుతున్న ఉత్తర కొరియా- రష్యా బంధం.. కిమ్ కు పుతిన్ గిఫ్ట్

ఉత్తర కొరియా- రష్యా దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ మీటింగ్ వల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాలు బలపడగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు సహాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి నుంచి ఆరోపణలు కూడా ఎదుర్కొంది. రష్యా, ఉత్తర కొరియా స్నేహబంధం మరింత బలపడేందుకు రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆదివారం కిమ్ కు ఓ కారును పుతిన్ బహుమతిగా పంపించారు.

Also read: Bengaluru Court: మాజీ సీఎం జయలలిత బంగారం వారికే.. బెంగళూరు కోర్టు సంచలన తీర్పు

ఆ కారును గిఫ్ట్ గా అంగికరిస్తున్నట్లు ఉత్తర కొరియా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కిమ్ సోదరి ఈ విషయంపై స్పందిస్తూ ఫుతిన్ కు థాంక్స్ చెప్పారు. ఈ గిఫ్ట్ ఇరు దేశాల మధ్య ఉన్న స్పెషల్ రిలేషన్ షిప్ కు గుర్తింపు అన్నారు. రష్యా తయారు చేసిన ఆ కారు స్పెసిఫికేషన్స్, ట్రాన్స్ పోర్ట్ వివరాలు బయటకు తెలియ పరచలేదు. కిమ్ కు ఆటో మొబైల్, లగ్జరీ కార్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో యూఎన్ భద్రతా మండలి ఉత్తర కొరియాకు లగ్జరీ వస్తువుల ఎగుమతిని నిషేధించినా.. పలు సందర్భాల్లో కిమ్ రోల్స్ రాయిల్స్ ఫాంటమ్, మెర్సిడెస్ లిమోసిన్లు, లెక్సస్ SUV వంటి కార్లలో తిరుగుతూ కనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button