తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Trump: ఎన్నికల రేసులో దూసుకెళ్తున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఆయన మరో ప్రైమరీలో విజయం సాధించారు. ఈ మేరకు దక్షిణ కరోలినాలో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి నిక్కీ హేలీనీని సునాయాసంగా ఓడించారు. అయితే అంతకుముందు దక్షిణ కరోలినాకు రెండుసార్లు గవర్నర్‌గా వ్యవహరించిన నిక్కీని ట్రంప్ ఓడించడం ప్రత్యేకమని తెలుస్తోంది. ఇప్పటికే లోవా, అయోవా, న్యూ హాంప్​షైర్​, నెవాడా రాష్ట్రాల ప్రైమరీల్లో ట్రంప్​ గెలుపొందిన సంగతి తెలిసిందే.

ALSO READ: బీఎస్పీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ రితేష్‌ పాండే

పోటీ నుంచి తప్పుకోలేదు..

‘ట్రంప్​ వర్గం ఎంత ఒత్తిడి చేసినా, నేను పోటీ నుంచి తప్పుకోలేదు. మార్చి 5న జరిగే పలు రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో కూడా పోటీలో ఉంటాను’ అని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ఇప్పటికే పలుచోట్ల విజయం సాధించారు. ఇక డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీల్లో అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ముందున్నారు. ప్రైమరీలు ముగిసి పార్టీల తరఫున అభ్యర్థులు ఖరారైన తర్వాత, 2024 నవంబర్​లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button