తెలుగు
te తెలుగు en English
మరిన్ని

IIT: ఐఐటీ పాలక్కాడ్ శాస్త్రవేత్తల ఘనత.. మనిషి యూరిన్‌తో విద్యుత్ ఉత్పత్తి

ప్రపంచంలో విద్యుత్‌కు ఎంతో డిమాండ్ ఉంది. నీటితో, బొగ్గుతో, సూర్యరశ్మితో విద్యుత్ ను ఉత్పత్తి చేయడం మనం చూసే ఉంటాం. అయితే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పాలక్కాడ్‌కి చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం చేశారు. మనిషి మూత్రంతో విద్యుత్ తో పాటు సహజ ఎరువులను కూడా ఉత్పత్తి చేసే కొత్త విధానాన్ని కనిపెట్టారు. మనిషి యూరిన్‌ను ఎలక్ట్రోకెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ లోకి ప్రవేశపెట్టి, ఎలక్ట్రోకెమికల్‌ రియాక్షన్స్‌‌కు గురిచేయడం వల్ల విద్యుత్తుతోపాటు బయోఫెర్టిలైజర్స్‌‌ను ఉత్పత్తి చేయొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

ALSO READ: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం

ఈ సరికొత్త సాంకేతికతతో మూత్రంలోని అయానిక్‌ బలాన్ని ఉపయోగిస్తారు. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోకెమికల్‌ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. అలాగే నత్రజని, భాస్వరం, మెగ్నీషియం బయోఫెర్టిలైజర్‌ తయారీకి ఉపయోగపడుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రోకెమికల్‌ రియాక్టర్‌, అమ్మోనియా అడ్సార్ప్షన్‌ కాలమ్‌, డీకోలరైజేషన్‌, క్లోరినేషన్‌ ఛాంబర్‌, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ మానిఫోల్డ్స్‌ ఉంటాయి. విద్యుత్‌, బయోఫెర్టిలైజర్‌లను ఏకకాలంలో ఉత్పత్తి చేసే ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యలను ప్రేరేపిస్తూ ఈఆర్‌ఆర్‌ఆర్‌లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఫలితంగా విద్యుత్‌తో పాటు, బయో ఫెర్టిలైజర్‌ తయారవుతుంది. ఈ ఎరువులో మొక్కలకు అవసరమైన పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button