తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Kane Williamson: కేన్ విలియ‌మ్స‌న్ పేరిట అరుదైన రికార్డు

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచ‌రీ కొట్టిన విలియ‌మ్స‌న్.. రెండో టెస్టులోనూ సెంచరీ కొట్టేశాడు. దీంతో 32 సెంచ‌రీలతో అగ్ర‌స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ రికార్డును స‌మం చేశాడు. అయితే ఈ పీట్‌ను స్మిత్ 174 ఇన్నింగ్స్‌లలో సాధించగా.. విలియ‌మ్స‌న్ 172 ఇన్నింగ్స్‌ల్లో సాధించి స్మిత్ కంటే త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 32 సెంచ‌రీల మైలురాయికి చేరుకున్నాడు.

17 రన్స్ అవసరం

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విలియ‌మ్స‌న్ సెంచ‌రీ కొట్టడంతో క్రికెట్ దిగ్గ‌జం డాన్ బ్రాడ్‌మ‌న్‌తో పాటు ఫ్యాబ్ 4లో ఉన్న‌ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో 31వ సెంచ‌రీతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇంకా కివీస్ 21 పరుగుల చేస్తే 2-0తో సిరీస్ సొంతం కానుంది. ప్రస్తుతం కివీస్ 3 వికెట్లకు 250 పరుగులు చేయగా.. విలియ‌మ్స‌న్(118), విల్ యంగ్(57) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button