తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Rayachoti: హాట్ టాపిక్‌గా రాయచోటి నియోజకవర్గం… టీడీపీ ఇన్‌చార్జి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఆయా నియోజకవర్గాల్లో సీట్ల కోసం రాజకీయా నాయకుల మధ్య పోటీ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల్లో పలు నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అధిష్టానానికి కూడా ఏం చేయాలో కొన్ని సందర్బలలో పాలుపోవడంలేదు. దాంతో కొందరు సీటు కోసం ఆశించే నాయకులు పరోక్షంగా పార్టీలపై బహిరంగ వ్యాఖ్యలకు, తమకు సీటు ఇవ్వకపోతే పార్టీ మారుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Also Read: రేవంత్ హవా కొనసాగేనా? …. ఏపీలో కాంగ్రెస్ దూసుకెళ్లెనా?

ఈ నేపథ్యంలోనే ఏపీలో రాయచోటి నియోజకవర్గ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రధాన పార్టీల కీలక నేతలు ఉత్సాహం చూపుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాయచోటి ఇన్‌చార్జి రమేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తనకు కాకుండా ఈ నియోజకవర్గాన్ని మరొకరికి కేటాయిస్తే తన నిర్ణయం ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: మాజీ సీఎం జయలలిత బంగారం వారికే.. బెంగళూరు కోర్టు సంచలన తీర్పు

కాగా, ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా రాయచోటి ఉండేది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. వైఎస్ మరణం తర్వాత జగన్‌ సారథ్యంలో ఏర్పడిన వైఎస్ఆర్సీపీ అక్కడ సత్తా చాటుతోంది. వైఎస్ఆర్సీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టబోయే టీడీపీ నేత ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button