తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Revanth Reddy: రేవంత్ హవా కొనసాగేనా? …. ఏపీలో కాంగ్రెస్ దూసుకెళ్లెనా?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తన వాక్ చతుర్యంతో ప్రజలను తన వైపుకు తిప్పుకున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దాంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విజయంలో రేవంత్ రెడ్డి పాత్రే అధికం అని చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలన్ని తన భుజాలపై వేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు.

Also Read: సొంతగూటికి వచ్చేస్తోన్న సీనియర్ ఎమ్మెల్యే.. ఆయనకేనా టికెట్?

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను ఒప్పించి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మొదటి నుంచే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ వచ్చింది. దాంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

Also Read: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌‌పై BIG UPDATE

అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విశేష కృషిచేసిన రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం సీఎం చేయడామే కాకుండా మరో ముఖ్య బాధ్యతను కూడా అప్పగించింది. ఏపీలో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ ను తిరిగి అధికార రేసులో నిలిచే బాధ్యతను కూడా రేవంత్ కు అప్పగించినట్లు తెలుస్తుంది. ఏపీలో కాంగ్రెస్ నిర్వహించే సభలకు రేవంత్ హజరవుతున్నట్లు సమాచారం.

Also Read: తెలంగాణలో కొలువుల జాతర.. గ్రూ‌ప్-1 నోటిఫికేషన్ విడుదల

ఈ నేపథ్యంలోనే షర్మిల బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25న జరగబోతున్న ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరవుతున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల గురించి ఏపీలో ఆ పార్టీ ప్రచారం చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button