తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు.. వారం రోజుల్లో స్పష్టత!

ఏపీలో ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రచారంతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 26 అంశాలతో మేనిఫెస్టో తీర్చిదిద్దింది. కేవలం నాలుగు పేజీల్లో కుదించిన మేనిఫెస్టోలో 99.5శాతం హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. కాగా, వారం రోజుల్లో మేనిఫెస్టోపై స్పష్టత రానుంది.

ALSO READ: మధ్యంతర బడ్జెట్ వర్సెస్ వార్షిక బడ్జెట్.. తేడా ఏంటో తెలుసా?

మరింత పకడ్బందీగా..

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా మేనిఫెస్టోపై వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు మరో రెండు ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు ప్రకటలపై మరికొన్ని రోజుల్లో వెలువరించే అవకాశం ఉండనుంది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాలను మరింత పకడ్బందీగా అమలు చేసేలా నిర్ణయించుకుటన్నట్లు సమాచారం.

ALSO READ: ప్రారంభమైన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు..కష్టాలు తీరినట్లే!

175 స్థానాల్లో గెలుపే లక్ష్యం..

అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. భీమిలిలో తొలి ఎన్నికల శంఖారావ సభను నిర్వహించిన అధికార పార్టీ.. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి సభ విజయవంతం కావడంతో మిగిలిన చోట్ల కూడా వరుస సభలు నిర్వహించేందుకు అనుగుణంగా వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడో తేదీన ఏలూరులో సిద్ధం పేరుతో మరో సభను ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button